రోజూ ఉదయమే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!

Publish Date:Nov 1, 2024

Advertisement

 

ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే..

ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది.

ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.


ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.


గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది.

ఏ ఉప్పు వాడితే మంచిదంటే..


నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

                                          *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు.
టీ.. భారతీయులకు ఒక ఎమోషన్.  ఒకప్పుడు పట్టణాలలో ప్రజలు,  బయటి షాపులలో మాత్రమే టీ కనిపించేది.
అన్నం భారతీయుల ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో  అన్నం లేకపోతే తిన్నట్టు ఉండదని అంటుంటారు.
బంగాళదుంపలు భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా ఇష్టమైన ఆహారం.
అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ముఖ్య ఔషధం.  ఇది మొక్క వేరు నుండి లభించే పదార్థం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి.
వంటింట్లో చాలా వరకు స్టీల్ సామాన్లు ఉంటాయి.
చిలకడదుంపలు చాలామందికి ఇష్టమైన ఆహారం.
డ్రై  ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
పువ్వులు మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి.
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని అవయవాలకు మెరుగైన రక్త ప్రసరణ అవసరం.  
తులసి ఒక ఆయుర్వేద మూలిక.  తులసి మొక్కను ఔషధంగానూ,  ఆధ్యాత్మికతలోనూ భాగం చేస్తారు.  ముఖ్యంగా హిందువులు తమ ఇళ్లలో తులసిని దైవంగా పూజించడం చూస్తునే ఉంటాం.
ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం లేకుండా ఒక పూట,   ఒక రోజు ఉండగలరు.  బలవంతంగా ఉండేవారు మహా అయితే రెండు రోజులు ఉండగలరు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.